మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2019 (16:51 IST)

సైరా ఊపుతో చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో చిరు 152 స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పైన రాంచరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం దసరా నాడు ప్రారంభమైంది. చిరంజీవి ఖైదీ నెం. 150తో రీ-ఎంట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన నేపధ్యంలో ఆ తర్వాత సైరాతో తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. 
 
ఇప్పుడు అదే ఊపుతో చిరంజీవి మరో చిత్రాన్ని చేసేందుకు సై అనేశారు. ఈ చిత్రంలో ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతలు : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి; దర్శకత్వం: కొరటాల శివ