శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'శభాష్‌ రా చిరంజీవి' అనేవారు... : మెగాస్టార్

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి అవిష్కరించనున్నారు. అనంతరం ఆ పక్కనే ఏర్పాటు చేసిన సభా వేదికపై చిరంజీవి ప్రసంగించారు. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు.
 
ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగిస్తూ, తాను తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే సమయానికే ఎస్వీ రంగారావు దూరమయ్యారని, ఇప్పుడు ఆయనే బతికి ఉండివుంటే, 'సైరా' చిత్రాన్ని చూసి 'శభాష్ రా చిరంజీవి' అని అనుండేవారని మెగాస్టార్ వెల్లడించారు. 
 
పైన ఎక్కడున్నా ఆ మహానటుడు తమ ప్రయత్నాన్ని దీవిస్తారనే నమ్ముతున్నానని అన్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తనను గంటా శ్రీనివాస్, ఈలి నాని తదితరులు గతంలోనే కోరారని, అయితే, అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అన్నారు. 
 
తన ఫ్యాన్స్ చూపే అభిమానమే తనను ఇంతవాడిని చేసిందన్నారు. భవిష్యత్తులో అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను చేయడమే లక్ష్యమన్నారు. తొమ్మిది అడుగులా 3 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతోందన్నారు.