శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (15:10 IST)

'సైరా' అద్భుతం : నారా లోకేశ్ ట్వీట్ : థాంక్యూ సోమచ్ సర్ అంటూ సురేందర్ రెడ్డి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా, ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. 'ఎంతో పరిశ్రమించి, చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, దర్శకులు సురేందర్ రెడ్డి, సాంకేతిక సిబ్బంది, యూనిట్ మొత్తానికి హర్థికాభినందనలు' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
 
కాగా, లోకేశ్ ట్వీట్‌పై సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందించారు. 'థాంక్యూ సోమచ్ సర్' అని రిప్లై ఇచ్చారు. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద 'సైరా' సందడి చేస్తోంది. శని, ఆదివారాలతో పాటు దసరా సెలవులు కూడా కావడంతో... థియేటర్లు నిండిపోతున్నాయి. 
 
ఇప్పటికే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్, నాని, సుధీర్ బాబు వంటి అనేక మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెల్సిందే. అలాగే, ఈ చిత్రంపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.