శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (20:18 IST)

ఇంతకంటే నాకు ఏం కావాలి - మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భారీ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రం 150వ గాంధీ జయంతి సందర్బంగా అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ హిస్టారికల్ హిట్ గా నిలిచి విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. 
 
ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ లో…మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... ఒక స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి పాత్ర చేయాలి. నా కెరీర్‌కి అది బెస్ట్ పాత్ర కావాలి. అలాంటి అవ‌కాశం ఎప్పుడొస్తుంది. వ‌స్తే బావుంటుంది క‌దా! అని అనుకుంటుండే వాడిని. నీ డ్రీమ్ క్యారెక్ట‌ర్ ఏంటి? అంటే స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు పాత్ర చేస్తే బావుంటుంద‌ని ఇది వ‌ర‌కు ఎన్నోసార్లు చెప్పాను. ఉదాహ‌ర‌ణ‌కు భ‌గ‌త్ సింగ్ పాత్ర చేయాల‌ని ఇర‌వై ఏళ్ల క్రిత‌మే చెప్పాను. 12 ఏళ్ల క్రితం అలాంటి అవ‌కాశం ఉన్న క‌థ‌తో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నాకు చెప్పారు. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. కానీ ఆ స‌బ్జెక్ట్ భారీగా తెర‌కెక్కాలి. 
 
కాంప్ర‌మైజ్ అయితే క‌థ‌కు న్యాయం చేయ‌లేం కాబ‌ట్టి ఆ సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్ప‌టికి కుదిరింది. గ‌త రెండున్న‌రేళ్లుగా మేం అంద‌రం క‌ష్ట‌ప‌డి చేసిన ప్ర‌య‌త్నం ఎంతో సంతృప్తిని క‌లిగించింది. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రూ ప్రాణం పెట్టి ప‌నిచేశారు. డైరెక్ట‌ర్‌గా సురేంద‌ర్ రెడ్డిని అనుకున్న త‌ర్వాత ఆయ‌న భూప‌తిరాజా, క‌న్న‌న్ త‌దిత‌రుల‌ను క‌లిసి కొన్నిరోజుల త‌ర్వాత అద్భుత‌మైన ట్రీట్‌మెంట్‌తో వ‌చ్చాడు. మా ద‌గ్గ‌ర క‌థ‌, సీన్స్ ఉన్నాయి. కానీ డ్రెమ‌టిక్ తీసుకు రావ‌డానికి మేం ప‌డ్డ క‌ష్టం తెర పై క‌న‌ప‌డుతుంది. అలాంటి అద్భుత‌మైన ట్రీట్‌మెంట్ చేసిన రోజున ఇది మ‌న క‌థేనా? అని ఆశ్చ‌ర్య‌పోయాను. అంతలా క‌థనాన్ని తీర్చిదిద్దిన సురేంద‌ర్‌రెడ్డి టీమ్‌ను అభినందిస్తున్నాను. 
 
ఈ అవకాశం మేమిచ్చాం అని అంద‌రూ అనుకుంటారు. కానీ క‌రెక్ట్ అయిన డైరెక్ట‌ర్ చేతిలో సినిమా పెడితే ఆయ‌న దీన్ని ఓ ఎపిక్‌లా తీసినందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. ప్ర‌తి సీన్‌ను ముందుండి చూసుకుంటూ వ‌స్తున్న స‌త్యానంద్‌గారు, స్క్రిప్ట్ డాక్ట‌ర్‌లా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న స‌ల‌హాలు మాకెంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. 
 
నా ఖైదీ నంబ‌ర్ 150లో న‌న్ను అందంగా చూపించాడు. చిరంజీవి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడ‌నేంత గ్లామ‌ర్‌గా నన్ను తెర‌పై చూపించాడు. అదేవిధంగా ఈసినిమాకు, చిరంజీవి అని కాకుండా ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నేను క‌న‌ప‌డేలా అప్ప‌టి ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా సినిమాను ఆవిష్క‌రించారు ర‌త్న‌వేలు. రెండున్న‌రేళ్లు ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో మాకు తెలుసు. 
 
ఆయ‌న‌కు ఈ సందర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అలాగే రాజీవ‌న్ గారు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా మా సినిమాకు త‌గిన‌ట్లు ఎఫెక్ట్ పెట్టారు. సినిమాకు కీల‌కంగా మారిన వి.ఎఫ్‌.ఎక్స్ విష‌యానికి వ‌స్తే... 3800 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌గారు. సాయిమాధ‌వ్ బుర్రాగారు అద్భుత‌మైన డైలాగ్స్ అందించారు. 
 
ఇక ఆర్టిస్టుల విష‌యానికి వ‌స్తే.. కీల‌క పాత్ర కోసం అమితాబ్‌గారు కావాల‌ని న‌న్ను అడిగిన‌ప్పుడు మా మ‌ధ్య మంచి అనుబంధం ఉన్నా స‌రే! ఆయ‌న చేస్తారా? చేయరా అని అనుకున్నాం. నేను ఫోన్ చేయ‌గానే .. నేను ఆ పాత్ర చేస్తే బావుంటుందా? అని అడిగారు. మీరు చేస్తే బావుంటుద‌ని నేను చెప్ప‌గానే స‌రే చేస్తానన్నారు. 
 
నేను నా స్నేహితుడి కోసం చేస్తున్నాను నాకు ఆ తృప్తి నివ్వండి చాలు అన్ని ఆయ‌న చెప్పి..నేను మీకు ఎలాంటి భారం ఇవ్వాల‌నుకోవ‌డం లేదు. ఆయ‌న త‌న ప్రైవేట్ జెట్‌లో త‌న టీమ్‌తో వ‌చ్చేవారు. మీరు మా అతిథి అంటే కూడా ఆయ‌న విన‌లేదు. ఆయ‌న్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయ‌న మ‌హానుభావుడు. ఆయ‌న రుణం ఎలా తీర్చుకోవాలో తెలియ‌డం లేదు. 
 
క‌న్న‌డ నుండి సుదీప్‌ను అడిగాం.. అలాగే త‌మిళం నుండి విజ‌య్ సేతుప‌తిని అడిగాం. అలాగే జ‌గ‌ప‌తిబాబు గారు కీలకపాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నారు. త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, అనుష్క‌, సాయిచంద్‌గారు ముందుకు వ‌చ్చారు. పాత్ర నిడివి ఎంత‌ని కాకుండా.. ప్రాముఖ్య‌త‌ను బ‌ట్టి న‌టించారు. గొప్ప డేడికేష‌న్ ఉన్న న‌టుడు. 
 
గొప్ప న‌మ్మ‌కంతో, ప్రేమించి సినిమా చేశాడు. జ‌గ‌ప‌తిబాబుగారు ఎప్పుడొస్తారు? ఎప్పుడెలాతారో తెలియ‌దు. చాలా డిసిప్లెయిన్ ఆర్టిస్ట్‌. ఆయ‌న సినిమాకు ఎంత హెల్ప్ అయ్యారంటే.. సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. సుదీప్ త‌నదైన న‌ట‌న‌తో అవుకురాజు క్యారెక్ట‌ర్‌ను ఎక్క‌డితో తీసుకెళ్లాడు. విజ‌య్‌సేతుప‌తి ఎంతో బిజీ ఆర్టిస్ట్ అయినా.. ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జ‌స్ట్ చేసి న‌టించాడు. 
 
సిద్ధ‌మ్మ‌గా న‌య‌న‌తార‌, ల‌క్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా ఒదిగిపోయారు. నా క్యారెక్ట‌ర్‌ను ప‌క్క‌న పెడితే.. త‌మ‌న్నా క్యారెక్ట‌ర్ గురించి అంద‌రూ గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంటి గొప్ప వ్య‌క్తి, యోధుడు క‌థ తెర‌మ‌ర‌గైంది. దీన్ని అంద‌రి ముందుకు తీసుకురావాల‌నే ఉద్దేశంతో తెలుగు సినిమాలాగానే కాకుండా ప్ర‌పంచంలోని భార‌తీయులు న‌ర‌సింహారెడ్డి గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. 
 
అలాంటి అవ‌కాశాన్ని మాకు ఇచ్చినందుకు, రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాం. ముంబై మీడియాలో సినిమాను చూసి సౌత్‌లో ఇంత గొప్ప యోధుడు ఉన్నాడా? అని అనుకున్నారు. సినిమా అనంత‌రం స్టాండిగ్ ఓవెష‌న్ ఇచ్చారు. నేను ఎంతో గ‌ర్వంగా ఫీల‌య్యాను. ఇది సౌత్‌, నార్త్ సినిమా అనే భేదాలు పోయి.. ఇండియ‌న్ సినిమా అని ముద్ర వేసుకుంది. 
 
చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మ‌రో ఎత్తు అని అంటుంటే .. చాల‌నిపించింది. నా బిడ్డ ఈ సినిమాను నిర్మించినందుకు ఇంత కంటే ఏం కావాల‌నిపించింది. సుస్మిత ఒక మామూలు టెక్నిషియ‌న్‌లా ప‌నిచేసింది. త‌న‌ని చూసి సంతోష‌ప‌డ్డాను. త‌న‌తో పాటు ప‌నిచేసిన అంజి మౌళి ప‌నిచేశారు. ఉత్త‌ర‌మీన‌న్‌కి థ్యాంక్స్‌.

సురేంద‌ర్ రెడ్డి ఎంత టెన్ష‌న్ ప‌డ్డాడో క‌ష్ట‌ప‌డ్డాడో నాకు మాత్ర‌మే తెలుసు. సురేంద‌ర్ రెడ్డి తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికి మ‌రో అద్భుతం. ఇలాంటి సినిమాను మాకు ఇచ్చినందుకు ఆయ‌న హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. సినిమా చూసిన వెంక‌టేశ్‌, నాగార్జున‌, మ‌హేశ్‌బాబు, మోహ‌న్‌బాబుగారు, నాని, రాజ‌మౌళి , త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ స‌హా డైరెక్ట‌ర్స్ అంద‌రూ అభినందించారు. అందికీ ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ సినిమాను ఆద‌రించి.. అభిమానిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు“ అన్నారు.