సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:31 IST)

మెగాస్టార్ సైరా ప్లాన్స్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌గా... బిగ్ బి కీల‌క పాత్ర పోషించారు. దేశ వ్యాప్తంగా టాలీవుడ్ స్థాయిని పెంచేందుకు మరో టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా విడుదలకు సిద్ధమైంది.
 
చిరు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా అక్టోబ‌ర్ 2న‌ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ముంబైలో ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సైరా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇప్ప‌టి నుంచి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 
 
బాలీవుడ్లో మ‌రో బిగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంద‌ని తెలిసింది. నార్త్ ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేసే విధంగా మీడియాతో ఇంటర్వ్యూలు అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ జెట్ స్పీడ్లో అవ్వాలని మెగాస్టార్ ప్రిపేర్ అవుతున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో హిందీ ఆడియెన్స్ కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మ‌రి.. సైరా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.