గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2019 (15:59 IST)

ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు: చిరుకు పుట్టినరోజు విషెస్ చెప్పిన లోకేష్‌

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు చిరంజీవికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్న పాత్రలలో నటించారని కొనియాడారు.

ఆయన ప్రేక్షకహృదయాలలో చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారని, పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని లోకేష్‌ వ్యాఖ్యానించారు. 
 
తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న చిరంజీవికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవే తమ స్ఫూర్తి అంటూ కొనియాడుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.