మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:06 IST)

చిందేస్తే కుర్రకారు గుండెల్లో చిరుగంటలు.. హ్యాపీ బర్త్‌డే టు చిరు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ఈ పేరు సినీ రంగంలో ఈ రోజుకి ఒక సెన్సేషన్. కష్టపడి చిన్న చిన్న పాత్రలతో కెరీ‌ర్‌ను మొదలుపెట్టి నేటికి సినీ రంగాన్ని ఏలే హీరోలలో మొదటి వ్యక్తి చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. "కష్టే ఫలి" ఈ నానుడి చిరు కోసమే పుట్టింది. చిరు చిందేస్తే కుర్రకారు గుండెల్లో చిరుగంటలు మోగుతాయి. 
 
'పునాది రాళ్ళ'తో సినీ రంగంలో గట్టి పునాది వేసుకుని 'ప్రాణం ఖరీదు'తో సినీ ప్రస్థానం మొదలు పెట్టి మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ కామెడీ టచ్‌తో 'చంటబ్బాయి'గా 'ఛాలెంజ్'‌ని యాక్సెప్ట్ చేసుకుని కష్టపడి తన సినీ కెరీర్‌ని 'స్వయం కృషి'తో నిర్మించుకుని అభిమానుల గుండెల్లో 'ఖైదీ' అయిన చిరు తన తోటి‌స్టార్స్‌కి గ్యాంగ్ 'లీడర్'గా మాస్ ఇమేజ్ కూడా తన సొంతమే అంటూ రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేసి తనకి తనే బెస్ట్ అనిపించుకున్నారు. హ్యాపీ బర్త్ డే టూ మెగాస్టార్ చిరంజీవి.