బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (11:42 IST)

#HBDMegaStarChiranjeevi హ్యాపీ బర్త్ డే ''అప్పా'': రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో అగ్రహీరోగా ముద్రవేసుకుని.. కుర్రకారు హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తున్న చిరంజీవికి పలువురు సెలెబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ తనయుడు, నటుడు, నిర్మాత రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
మీరు నాకు స్ఫూర్తి అని, నాకు మెంటర్, గైడ్ అని పేర్కొన్నాడు. అందరూ మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మాత్రం మిమ్మల్ని ''అప్పా'' అని పిలుస్తాను. విష్ యు హ్యాపీ బర్త్ డే అప్పా. మీరు మాకు స్ఫూర్తి ప్రదాతగా కొనసాగాలని ఆశిస్తున్నాను. లవ్ యూ లాట్ అంటూ చెర్రీ తెలిపాడు. ఇంకా #HBDMegaStarChiranjeevi అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.