ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 29 ఆగస్టు 2019 (14:12 IST)

మెగాస్టార్‌ను కలిసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు... ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. రేనాటి వీరుడు, తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇకపోతే నేడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన స్వగృహంలో కలిసి ఆనందంగా ముచ్చటించడం జరిగింది. సైరా చిత్రం ద్వారా నరసింహారెడ్డి గారి కుటుంబసభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ అన్నారు. 
 
ఇక వారితో కలిసి మెగాస్టార్ దిగిన ఫోటో కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయి, విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సైరాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.