శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 జులై 2019 (19:26 IST)

వివాహం అయిన ఆడవారు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు?

హిందూ, ముస్లిం సాంప్రదాయాలలో స్త్రీల వైవాహితకు గుర్తుగా మెట్టెలు తొడగడం ఆనవాయితి. అదీ ప్రత్యేకించి కాలి రెండో వేలుకు ధరించడం, అంతేకాకుండా వెండి ధాతువుతో తయారైనవే ధరించడం. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారపు మెట్టెలు వాడినా అది సంప్రదాయానికి వ్యతిరేకం అంటారు.
 
ఇక కాలు రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి అంటారు మోగా, ఆయుర్వేద నిపుణులు. నడిచే సమయంలో మెట్టెల ఘర్షణ ప్రేరితాలైన ఈ నాడీ కేంద్రాలు ఆరోగ్యవంతమైన, ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు. 
 
అంతేకాకుండా దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని కూడా చెబుతున్నారు. అంటే మెట్టెలు కామక్షేత్ర నియంత్రణ యంత్రాలన్నమాట. అందుకే పూర్వకాలంలో ఈ మెట్టెల్ని స్త్రీ పురుషులు ఇద్దరూ వాడేవారట.