బౌల్ట్.. అది యాపిల్ కాదు.. పొరపాటున తినేయవద్దు..
కివీస్ వర్సెస్ శ్రీలంకల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్ లసిత్ ఎంబుల్‌డేనియా వేసిన బంతి కివీస్ బ్యాట్స్‌మెన్ ట్రెంట్ బౌల్ట్ స్వీప్ చేసే దిశలో బాల్ హెల్మెట్ గ్రిల్స్‌లో చిక్కుకుంది. కానీ అదృష్టవశాత్తు బౌల్ట్‌కు ఎలాంటి గాయం కాలేదు.
లసిత్ వేసిన బాల్ బ్యాట్స్ మెన్ బ్యాట్ కు టాప్ ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపించగా ఆ తర్వాత బాల్ ఎటెళ్లిందో ఆటగాళ్లకు అర్ధం కాక అయోమయంలో ఉన్నారు. అయితే బౌల్ట్ తన హెల్మెట్ గ్రిల్స్‌లో చిక్కుకున్న బాల్ తీయడంతో అందరు షాక్ అయ్యారు. ఈ సీన్ చూసిన ఐసీసీ స్వయంగా కాట్ అండ్ బౌల్ట్ అంటూ సరదాగా ట్వీట్ చేసింది.
అంతేగాకుండా క్రీడాభిమానులు కూడా ఈ ఫోటోపై విభిన్నాభిప్రాయాలు పోస్టు చేస్తున్నారు. బౌల్ట్ అది యాపిల్ కాదు.. క్రికెట్ బాల్ అంటూ సెటైర్లు విసురుతున్నారు. పొరపాటున తినేయవద్దంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.