గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (12:34 IST)

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: భారత్‌కు కివీస్ వెనక్కి నెట్టేనా?

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ 113 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ 109 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లంకతో జరిగే సిరీస్‌ను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే.. 115 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. 
 
అయితే త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో సాధిస్తే తిరిగి అగ్రస్థానంను కైవసం చేసుకుంది. టెస్టులో పటిష్టంగా ఉన్న భారత్.. వెస్టిండీస్‌పై సిరీస్ నెగ్గడం సులభమే. అదేవిధంగా బలహీన లంకపై కివీస్ కూడా గెలవడం సాధ్యమే. 
 
ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకోవడానికి కివీస్‌కు ఇదే మంచి అవకాశం. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకునే అవకాశం వుంటుంది.