మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (13:23 IST)

రవిశాస్త్రి వల్లే రెండు కప్‌లు ఎగిరిపోయాయ్.. రాబిన్ సింగ్ ఫైర్

ప్రపంచకప్ ముగియడంతోనే రవిశాస్త్రితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పదవీ కాలం ముగిసినప్పటికీ వెస్టిండిస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అందరి పదవి కాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. 
 
ఆగస్టు నెలలో హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవి కొద్దికాలంలో ఊడనుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి కోచింగ్ సారథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
రవిశాస్త్రి కోచ్‌గా వున్న సమయంలో భారత కీలక రెండు ప్రపంచ కప్‌లను కోల్పోయిందని.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ విమర్శించాడు. రవిశాస్త్రి కోచింగ్ సారథ్యంలో భారత్ వరుసగా పరాజయాలు పాలైందని.. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఓడిపోవడం, అలాగే టీ-20 ప్రపంచ కప్ పోటీల్లోనూ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిందని గుర్తు చేశాడు. ప్రస్తుతం 2023 ప్రపంచ కప్ పోటీలకు టీమిండియా సన్నద్ధం కావాల్సిన పరిస్థితి అని పిలుపునిచ్చాడు.