సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (12:40 IST)

రిషబ్ పంత్ అవుట్.. కోచ్‌తో కోహ్లీ ఏమన్నాడు? (video)

ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌‍లో భారత్ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో యువక్రికెటర్లకు షాట్ ఎంపికపై కెప్టెన్ విరాట్ కోహ్లీ  కొన్ని సూచనలు చేశాడు. 12వ సీజన్ ప్రపంచ కప్ లీగ్ దశలో అద్భుతంగా ఆడిన భారత జట్టు, సెమీఫైనల్లో మాత్రం కివీస్ చేతిలో పరాజయం పాలవడానికి కారణాలేంటని అందరూ చర్చించుకుంటున్నారు. 
 
ఇంకా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇంకా బౌండరీలతో ఉతికేశాడు. అయితే కీలక సమయంలో అవుట్ అయ్యాడు. రిషబ్ అవుట్ అయిన వెంటనే కోహ్లీ రవిశాస్త్రి వద్దకు వచ్చి.. ఏదో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 
 
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ ఆటతీరు మెరుగ్గా వుందని.. కానీ కొన్ని తప్పిదాలున్నాయని.. తాను కూడా ఇలాంటి తప్పులు చేశానని చెప్పాడు. అతను కొట్టిన ఓ షాట్ గురించే అక్కడ మాట్లాడానని.. ఈ షాట్ కాకుండా వేరే షాట్ కొట్టి వుంటే బాగుండేదని అతను కూడా గ్రహించి వుంటాడని కోహ్లీ తెలిపాడు.
 
రిషబ్ పంత్ కొన్ని షాట్లపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే పంత్ గురించిన షాట్ వివరాలను గురించి కోచ్ దగ్గర తాను మాట్లాడలేదని చెప్పాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవిశాస్త్రి, కోహ్లీల సంభాషణకు కొత్త కొత్త డబ్ స్మాష్‌లు చేర్చి వీడియోలు వదులుతున్నారు. ఇంకా మీమ్స్ పేలుతున్నాయి.