ప్రపంచకప్ తొలి ఫైనల్- కివీస్ బ్యాటింగ్.. న్లో ఫ్లై జోన్
ప్రపంచ కప్‌లో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.
ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని భారత్.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇకపోతే.. శనివారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా బ్రాడ్‌ఫోర్ట్ జోన్‌లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ బ్యానర్లతో పదేపదే చక్కర్లు కొట్టింది. ఇండియా స్టాప్ మాబ్ లించింగ్, జస్టిస్ ఫర్ కశ్మీర్ అన్న బ్యానర్లతో ఆ విమానం మాంచెస్టర్ గగనతలంలో విహరించింది.
ఈ ఘటన పట్ల ఆందోళనకు గురైన ఐసీసీ ఇవాళ ఆ స్టేడియంలో ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఆదేశాలు జారీ చేసింది. తొలి సెమీఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ లేఖలో ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పింది.