సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (11:55 IST)

ఆవలిస్తే తప్పా? ఆటగాళ్లను వ్యక్తిగతంగా దూషిస్తారా?: సర్పరాజ్ ప్రశ్న

భారత్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో.. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీతో పాటు ఆటలోనూ రాణించలేకపోవడంతో సర్పరాజ్‌పై ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతనిపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ స‌ర్ప‌రాజ్‌ను అయితే సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ ఆటాడుకుంటున్నారు. 
 
ఇంకా మైదానంలో సర్పరాజ్ ఆవలించడంపై ట్రోల్ చేశారు. దీనిపై సర్పరాజ్ స్పందిస్తూ.. ఆవలింపు తప్పేమి కాదు, అది సాధారణ విషయమే. మ్యాచ్ ఓడిపోతే అభిమానుల కన్నా మేమే ఎక్కువ బాధపడతాం అని పాకిస్థాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్ తెలిపాడు. 
 
అంతేగాకుండా.. సర్పరాజ్‌ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ''సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా'' అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. 
 
కాని స‌ర్ప‌రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. వీడియో షేర్ కావడంతో పాపం సర్ఫరాజ్ అవమానాల పాలయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. నెటిజన్లు ఆ అభిమాని చర్యను తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సర్పరాజ్ స్పందించాడు. 
 
సోషల్‌ మీడియా వల్ల ఆటగాళ్ల మానసికస్థైర్యం దెబ్బతింటుంది. ఆటగాళ్లను విమర్శించే హక్కు అభిమానులకులు ఉంది. అది తప్పుకాదు. కానీ.. వ్యక్తిగతంగా ఆటగాళ్లను దూషించడం సరైంది కాదు. ఇలాంటి చర్యల వల్ల ఆటగాళ్ల కుటుంబాలు ఇబ్బంది పడతాయని సర్పరాజ్ వ్యాఖ్యానించాడు.
  
అభిమానులు ఎంత భావోద్వేగంతో ఉంటారో తెలుసు. మ్యాచ్ గెలిస్తే ఆకాశానికి ఎత్తుకుంటారు. ఓడిపోతే బాధపడతారు. అభిమానుల కన్నా మేమే ఎక్కువ బాధపడతాం. ఆవలింపు తప్పేమి కాదు, అది సాధారణ విషయమేనని సర్ఫరాజ్ కామెంట్ చేశాడు.