మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (19:14 IST)

పసి కూనలపై కోహ్లీ సేన ఆట ఏడిచినట్లే వుంది... పరుగులు 224

ప్రపంచ కప్ 2019 పోటీల్లో భాగంగా ఇవాళ ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా బరిలోకి దిగిన భారత జట్టు పేలవమైన బ్యాటింగ్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి.

పసికూనలపై వీళ్ల ఆట ఏడిచినట్లే వున్నదంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్ణీత 50 ఓవర్లకి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. 
 
రోహిత్ శర్మ కేవలం ఒక్కటంటే ఒక్క పరుగుకే ఔటై వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి మాత్రమే 67 పరుగులు చేయగలిగాడు. రాహుల్ 30 పరుగులు, శంకర్ 29, ధోని 28, జాధవ్ 52, పాండ్యా 7, మహ్మద్ సామి 1, కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 1 పరుగు చేసారు.