వరల్డ్ కప్ : శ్రీలంకను కట్టడి చేసిన ఇంగ్లండ్

sri lanka cricket team
Last Updated: శుక్రవారం, 21 జూన్ 2019 (19:36 IST)
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు జట్టును కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో అతికష్టంమ్మీద 232 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక లంక బ్యాట్స్‌మెన్లు అష్టకష్టాలు పడ్డారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు అతికష్టమ్మీద 50 ఓవర్లు ఆడి 9 వికెట్లకు 232 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కేవలం మూడు పరుగులకే ఔట్ కాగా, మిడిలార్డర్‌లో ఫెర్నాండో (49), మెండిస్ (46)లు కొంతమేరకు పోరాడారు.

ఒక దశలో 38 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత మిగిలిన 12 ఓవర్లలో ఆ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఏంజెలా మాథ్యూస్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ధనంజయ డిసిల్వ (29) నుంచి మాథ్యూస్‌కు మంచి సహకారం అందింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వుడ్ చెరో 3 వికెట్లు తీయగా, అదిల్ రషీద్ 2 వికెట్లు సాధించాడు.దీనిపై మరింత చదవండి :