2019 విశ్వవిజేతగా నిలిచేది మాత్రం "మెన్ ఇన్ బ్లూ'': సుందర్ పిచాయ్

sundar pichai
Last Updated: శుక్రవారం, 14 జూన్ 2019 (11:57 IST)
2019 ప్రపంచ కప్‌‌ను ఏ జట్టు గెలుచుకుంటుందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌తో ఇంగ్లండ్ తలపడుతుందని చెప్పారు. చివరకు విశ్వవిజేతగా నిలిచేది మాత్రం మెన్ ఇన్ బ్లూ (భారత్) అని సుందర్ పిచాయ్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా బలమైన జట్లు అని చెప్పారు. 
 
తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వచ్చిన కొత్తల్లో తాను తొలిసారి బేస్ బాల్ మ్యాచ్ ఆడానని.. తాను కొట్టిన బంతి వెనక వైపుగా వెళ్లిందని, క్రికెట్లో అయితే అది చాలా మంచి షాట్ అని చమత్కరించారు. 
 
క్రికెట్లో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బ్యాట్ చేతిలో పట్టుకొని పరుగెడతామని, బేస్ బాల్ లో కూడా అదే విధంగా బ్యాట్ పట్టుకుని పరుగెత్తానని చెప్పారు. ఇక బేస్ బాల్ కొంచెం కష్టమనిపించిందని.. కానీ, ఇప్పటికీ తనకు క్రికెటే ఇష్టమని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతానని సుందర్ పిచాయ్ వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :