బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (13:33 IST)

వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి : కోహ్లీ ఆ ఆనవాయితీని రిపీట్ చేసేనా?

వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా బుధవారం భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగనుంది. 
 
కాగా, ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. వీటిలో మూడుసార్లు సఫారీలు విజయకేతనం ఎగురవేయగా, ఒకసారి మాత్రం భారత్ విజయం సాధించింది. ఈలెక్కల ప్రకారం చూస్తే భారత్‌పై సఫారీలతో పైచేయిగా ఉంది. 
 
మరోవైపు, సౌతాంప్ట‌న్‌లో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేస్తాడా అన్న‌దే ఇప్పుడు టాపిక్‌. వ‌ర‌ల్డ్‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీకి సెంచ‌రీ కొట్ట‌డం అల‌వాటే. 2011లో, ఆ త‌ర్వాత 2015లోనూ.. కోహ్లీ సెంచ‌రీల‌తో టోర్నీలకు కిక్ ఇచ్చాడు. 2011లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచ‌రీ చేశాడు. 
 
2015 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ పాకిస్థాన్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ కొట్టాడు. మరి బుధవారం కూడా కోహ్లీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తాడా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ రెండు సెంచ‌రీలు చేసిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయభేరీ మోగించింది.