శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (18:51 IST)

యుఏఈలో భారతీయులను పలకరిస్తున్న అదృష్ట దేవత.. ఎలా?

యుఏఈలో భారతీయులను అదృష్టం వెంబడిస్తోంది. తాజాగా కొందరు ప్రవాస భారతీయులు యూఏఈ లాటరీలో బంపర్‌ప్రైజ్‌లు గెలుపొందారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఏకంగా 2.7 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్ల లాటరీ తగిలింది. 
 
ఆర్‌.సంజయ్‌‌నాథ్ అనే వ్యక్తి ఇటీవల‌ అబుదాబీలో లాటరీ టికెట్‌ను కొన్నాడు. ఇటీవలే ఆ లాటరీకి సంబంధించి బంపర్‌ ప్రైజ్‌ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.7 మిలియన్ల అమెరికా డాలర్లు) గెలుపొందాడు. ఈ విషయాన్ని యూఏఈ మీడియా మంగళవారం నాడు తెలిపింది.
 
ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని కూడా పేర్కొంది. అబుదాబీలో ‘బిగ్‌ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. మరో భారతీయుడు బినూ గోపీనాథన్‌ రెండో బహుమతిగా 1,00,000 దిర్హామ్‌లు గెలుచుకున్నాడు.
 
గత నెల కూడా ఓ భారతీయుడు ఇటువంటి బంపర్‌ ప్రైజే గెలుచుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న షోజిత్‌ కేఎస్‌ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్‌లు (4.08 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు.