భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై కోహ్లీ.. కొత్తవాళ్లకు కంగారు వుంటుందట..
భారత్-పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇండో-పాక్ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త ఉద్విగ్నత.. కంగారు వుంటుందని కోహ్లీ తెలిపాడు.
కానీ కొందరు మాత్రం ఇండో-పాక్ మ్యాచ్‌ల్లోని ఒత్తిడి అధిగమిస్తూ రాణించగలరని.. కానీ తనతో పాటు కొందరు అనుభవజ్ఞులు పక్కా ప్రొఫెషనల్స్ అని, తమ నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లో పాల్గొనడం గౌరవంగా భావిస్తామని కోహ్లీ చెప్పాడు.
న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ త్వరలో జరుగనుందని.. ఆ మ్యాచ్‌ను తమ టీమ్ సీరియస్‌గా తీసుకుందన్నాడు. అంతేగాకుండా పాకిస్థాన్ జట్టులోని కొత్త ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కాస్త కంగారును పుట్టిస్తుందని.. ఇక ప్రొఫెషనల్స్‌కు ఆ పని వుండదని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే.