మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (16:25 IST)

టౌంటన్‌‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్.. జంపా స్థానంలో రిచర్డ్ సన్..

ప్రపంచ కప్‌లో భాగంగా టౌంటన్‌లో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్‌ను 14 పరుగులతో ఓడించిన పాకిస్థాన్.. అదే ఊపుతో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. 
 
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో 36 పరుగుల తేడాతో చిత్తయింది. గాయపడిన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ స్థానంలో షాన్ మార్ష్‌ను జట్టులోకి తీసుకుంది. ఆడమ్ జంపా స్థానంలో కేన్ రిచర్డ్ సన్ జట్టులోకి వచ్చాడు. ఇక పాకిస్థాన్ కూడా షాదాబ్ ఖాన్‌కి బదులు షహీన్ ఆఫ్రీదీని తుది జట్టులోకి ఎంపిక చేసింది. 
 
అలాగే ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విండీస్ చేతిలో ఓడిపోయింది. కానీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, వన్డే ర్యాంకింగ్‌లలో నెంబర్ వన్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. శ్రీలంకతో ఆడాల్సిన పాక్ మూడో మ్యాచ్ ఒక బంతి కూడా పడకుండానే వర్షార్పణం కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. 
 
ఇకపోతే.. నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా ఏడు ఓవర్లు ముగిసే నాటికి ఆస్ట్రలియా వికెట్లేమి నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ (16), వార్నర్ (18) నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అపజయం మూటగట్టుకున్న ఆస్ట్రేలియా, ఎలాగైన ఈ మ్యాచ్‌లో రాణించి వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటుకోవాలని ఊవిళ్లూరుతోంది.