'అంతేగా' అనుకున్నారు... పాండ్యా-చాహెల్‌తో కివీస్‌కు F2... చితక్కొట్టేశారు..
అంతేగా... లక్ష్యం చాలా సింపుల్.. ఈజీగా గెలిచేయవచ్చు అనుకుని రొమ్ము విరుచుకుంటూ మైదానంలోకి దిగారు కివీస్ ఆటగాళ్లు. అంతకుముందు టీమిండియా బ్యాట్సమన్ హార్దిక్ పాండ్యాతో ఫ్రస్టేషన్‌కి వెళ్లినా... టార్గెట్ చిన్నదే కదా... ఫన్ గేమ్‌లా ఆడుకోవచ్చని అనుకున్నారు కానీ వాళ్ల ఫన్ కాస్తా ఫ్రస్టేషన్.. అదే F2గా మారిపోయింది.
అంతేగా అనుకున్నది కాస్తా అబ్బో అనిపించింది. భారత్ బౌలర్ల ధాటికి చివరికి 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 217 పరుగులు చేసి 44.1 ఓవర్లకే చతికిలపడిపోయింది న్యూజీలాండ్. దీనితో టీమిండియా సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇకపోతే అంతకుముందు అంబటి రాయుడు 90 పరుగులు, హార్దిక్ పాండ్యా 45 పగులు చేసి భారత్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించారు.
వన్డే సిరీస్ ముగిసింది కానీ బుధవారం నుంచి టీ-20 ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లను తలచుకుంటే కివీస్ ఆటగాళ్లకు తడిసిపోతోంది. మరి బుధవారం టీం ఇండియాను ఎలా ఎదుర్కోవాలా అని ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. చూడాలి.. టీ-20 మ్యాచ్‌లలోనైనా గట్టిపోటీ ఇస్తారేమో?