ఎంతపని చేసావ్ రాయుడు.... న్యూజీలాండ్‌కి సింపుల్ టార్గెట్ 253

Last Modified ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:32 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు కీలక సమయంలో అంబటి రాయుడు చేసిన తప్పిదానికి విజయ్ శంకర్ వికెట్ పోయింది. వికెట్ల మధ్య పరుగు తీసేటపుడు అంబటి రాయుడితో సమన్వయ లోపంతో విజయ్ శంకర్ పిచ్ మధ్యలో నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. దానితో చక్కగా అతడిని రనౌట్ చేసారు న్యూజిలాండ్ ఆటగాళ్లు.

కాగా విజయ్ శంకర్ 64 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేసాడు. అంతకుముందు కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకన్న తరుణంలో అంబటి రాయుడు-శంకర్ జోడి చక్కగా రాణిస్తూ వచ్చారు. ఐతే పరుగులు తీసే క్రమంలో అంబటి రాయుడు తొందరపాటుతనం వల్ల శంకర్ (45 పరుగులు) వికెట్ పోయింది.

ఇక మిగిలిన ఆటగాళ్ల విషయానికి వస్తే...
రోహిత్ శర్మ 2, శిఖర్ ధావన్ 6, శుభమన్ గిల్ 7, మహేంద్రసింగ్ ధోని 1, అంబటి రాయుడు 90, కేదార్ 34, పాండ్యా 45, భువనేశ్వర్ కుమార్ 6, సామి 1. మొత్తం 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసారు.దీనిపై మరింత చదవండి :