సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:56 IST)

కౌసల్య ఎవరు... ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారు..

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ప్రణయ్ పరువు హత్య తరహాలోనే.. గత 2016 సంవత్సరం.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న శంకర్, కౌసల్య దంపతులపై దాడి జరిగింది. ఈ దాడిలో శంకర్ దారుణంగా హత్యకు గురైయ్యాడు. కౌసల్య కత్తి గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. తమిళనాట జరిగిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. 
 
దీంతో కౌసల్యకు మద్దతుగా పలువురు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కౌసల్య ఇటీవల శక్తి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఆమె ఇచ్చిన భేటీలో భారత రాజకీయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో కౌసల్యను కున్నూరు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా.. ఇటీవల ప్రణయ్ భార్య అమృతని కలవడానికి తమిళనాడు నుండి ఈ కౌసల్య వచ్చింది. ప్రణయ్ మాదిరిగానే కౌసల్య భర్తను కూడా పరువు హత్య చేసారు. కౌసల్య కూడా తల్లిదండ్రుల మీద అమృతల న్యాయపోరాటానికి దిగింది. ఇందులో విజయం సాధించింది. కౌసల్య 13 మార్చి 2016 నాడు తమిళనాడు, తిరుపూర్‌జిల్లా ఉడుముల్‌పేట్‌ మార్కెట్‌లో కర్కష దాడికి గురయ్యింది. 
 
తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శంకర్‌ని పట్టపగలు అందరు చూస్తుండగానే కిరాయి హంతకులు కర్కశంగా చంపేశారు. ఈ దాడికి కౌసల్య తల్లిదండ్రులే కారణం. కౌస‌ల్య తన భర్తను చంపినవారికి తగిన శిక్ష కోసం పొరాటం చేసింది. తన తల్లిదండ్రులకు, హంతకులకు ఉరిశిక్ష వేయించింది. ప్రస్తుతం కౌసల్య భారత్, రాజకీయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. సస్పెన్షన్ వేటుకు గురైంది.