శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (18:44 IST)

కుప్పంలో మహిళకు లైంగిక వేధింపులు... సీఎం సీరియస్... బాధ్యుడు సస్పెండ్

కుప్పంలో ఎమ్మార్వో ఆఫీసులో పనిచేసే మహిళా ఆఫీసు అసిస్టెంట్ పైన వీఆర్ఎ వేధింపులకు పాల్పడంపై మీడియాలో కథనాలు రావడంతో అవి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాయి. మహిళా అటెండర్‌ను విఆర్‌ఏ వేధించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు విచారించాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు. 
 
దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్‌కత్తా పర్యటనలో వున్న ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారి చేయడంతో అతడిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.