నా కోర్కె తీర్చుతావా.. లేదా? మహిళా అటెండర్‌కు పైఅధికారి వేధింపు
మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి చాలాచోట్ల వుంది. లైంగిక వేధింపులకు పాల్పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మహిళలను లైంగిక వేధించడం ఆగటం లేదు. తాజాగా చిత్తూరులో మరో మహిళా ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
చిత్తూరులోని కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళను
కోరిక తీర్చమంటూ ఆమె పైఅధికారి వేధింపులకు పాల్పడుతున్నట్లు సదరు ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. ఐతే ఆమె ఫిర్యాదుని పట్టించుకోకపోవడంతో తనకిక ఆత్మహత్యే శరణ్యమంటోంది బాధితురాలు.