కౌగిలింతల ఉద్యోగం.. రూ.లక్షల్లో ఆదాయం .. ఎలా?
అమెరికాకు చెందిన ఓ యువతి నెలకు లక్షలాది రూపాయలను అర్జిస్తోంది. ఆమె చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? కౌగిలించుకోవడం. దీనివల్ల లక్షల్లో ఆదాయం ఎలా వస్తుందన్నదే కదా మీ సందేహం. ఈ కథనాన్ని చదవండి.
చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. మనసులో ఏదో తెలియనిబాధ వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేరు. అలాగని ఆ భారాన్ని దించుకోలేరు. గుండెల నిండా నిండిన బాధను వదిలించుకుని ప్రశాంతంగా జీవించాలని భావిస్తుంటారు.
ఇలాంటి వారి కోసమే ఆ యువతి నేనున్నానంటూ చేతులు చాచి పిలుస్తోంది. ఆమె పేరు రాబిన్ స్టినె. అమెరికాలోని కన్సార్‌కు చెందిన రాబిన్ స్టినె కౌగిలించుకోవడాన్ని ఉద్యోగంగా ఎంచుకుంది. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఇది కేవలం ఒత్తిడిని దూరం చేసేందుకు మాత్రమేననే సంగతి గుర్తు పెట్టుకోవాలి.
ఈ యువతి కేవలం బాధలో ఉన్న వ్యక్తిని కౌగిలించుకోవడమే కాదు. ఒత్తిడిలో సతమతమైపోతున్నవారిని సేదతీరుస్తానంటోంది. తన శరీరాన్ని కస్టమర్లకు అప్పగిస్తానని.. చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని తెలిపింది. తాను కూడా కస్టమర్స్ (ఒత్తిడితో వచ్చినవారిని) శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడిని దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది. ఇది కేవలం థెరపీ మాత్రమేనని, మరో ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టంగా చెబుతోంది.