మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (13:45 IST)

ఆపరేషన్ రూమ్‌లో నర్సు పెదవులను జుర్రుకున్న సర్జన్.. వీడియో వైరల్

పేరుకే ప్రభుత్వ సివిల్ సర్జన్. అయితే ప్రాణాలు కాపాడాల్సిన ఆపరేషన్ రూమ్‌లో ఓ సర్జన్.. రాసలీలలు మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ రాసలీలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో సర్జన్ ఉద్యోగం కాస్త ఊడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్లో నర్సు పెదవులను జుర్రుకున్న సర్జన్ వీడియో లీక్ కావడంతో.. ఆ వైద్యుడిని తొలగించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో మరో వైద్యుడిని నియమించింది. ఈ వీడియో తొలుత వాట్స్ యాప్‌కు ఎక్కి, ఆపై యూట్యూబ్, ఫేస్ బుక్ తదితరాల్లోకి షేర్ అయింది. ఆస్పత్రి వాట్సాప్ గ్రూప్‌లో ఈ వీడియో తొలుత చక్కర్లు కొట్టిందని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.