1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. We are planning a straight film with the success of Papa: Producer Neeraja Kota

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

Neeraj Kota, Appaji and team
Neeraj Kota, Appaji and team
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పాపా" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ శ్రీమతి నీరజ కోట. తమిళంలో సంచలన విజయం సాధించిన "దాదా" చిత్రాన్నిజె.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెలుగులో "పాపా" పేరుతో అనువదించారు నీరజ. ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతుండడం పట్ల ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేశారు. 
 
కవిన్ - అపర్ణాదాస్ జంటగా భాగ్యరాజా, విటివి గణేష్ కీలక పాత్రల్లో రూపొంది తమిళంలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి గణేష్.కె.బాబు దర్శకత్వం వహించారు.
 
హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సంధ్య థియేటర్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో నీరజ కోట మాట్లాడారు. ఇంత మంచి చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సినిమా చూస్తున్నవారంతా... స్ట్రెయిట్ సినిమా చూస్తున్నట్లుగా ఉందని చెబుతుంటే... ఈ సినిమా కోసం తాము పడిన కష్టమంతా మర్చిపోయేట్టు చేస్తోందని తెలిపారు. జెన్.మార్టిన్ సంగీతం, ఎలిల్ అరసు ఛాయాగ్రహణం.. ముఖ్యంగా గణేష్ బాబు దర్శకత్వం "పాపా" విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నీరజ అన్నారు. కవిన్ - అపర్ణాదాస్ ల మధ్య కెమిస్ట్రీ, కాన్ఫ్లిక్ట్ అందరినీ కట్టిపడేస్తోందని ఆమె వివరించారు.
 
ఈ సినిమా విజయం ఇస్తున్న ఉత్సాహంతో... త్వరలో ఒక స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేస్తున్నామని నీరజ ప్రకటించారు. ఈ సక్సెస్ మీట్ లో.. ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 236 థియేటర్లలో విడుదల చేసిన ఎమ్.జి.ఎమ్ మూవీస్ ఎమ్.అచ్చిబాబు, ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల, బిజినెస్ కోఆర్డినేటర్ నారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొని... "పాపా" వంటి హార్ట్ టచ్చింగ్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులకు అందించిన నీరజ కోటను అభినందించారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్