శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 31 జనవరి 2019 (18:18 IST)

విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్న 'ఇస్మార్ట్ శంకర్'

హీరోల మధ్య పోటీ మామూలే. అయితే ఒక క్రేజీ హీరో మరో క్రేజీ హీరోను ఫాలో అవ్వడమంటేనే కొద్దిగా వెరైటీ ఉంటుంది. అందులోను వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండను ఆ విషయంలో ఫాలో అవ్వడమే కాకుండా అతడిని మించిపోతానంటున్నాడు హీరో రామ్. ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండను రామ్ ఎందుకు ఫాలో కావాల్సి వచ్చిందో చూద్దాం.
 
హలో గురూ ప్రేమ కోసమే సినిమా తరువాత రామ్ తన 17వ సినిమా గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో రామ్ తెగ బాధపడిపోతున్నాడట. అందుకే ట్విట్టర్ వేదికగా ఒక సందేశాన్ని అభిమానులకు పంపాడట. హలో గురూ ప్రేమ కోసమే సినిమా తరువాత అప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఒకేసారి వడ్డీతో పాటు మీకు తిరిగిచ్చేస్తానంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశాడట రామ్.
 
గతంలో విజయ్ దేవరకొండ కూడా నోటా సినిమా ఫెయిల్ కావడంతో అభిమానులను ఉత్సాహపరిచేందుకు రానున్న సినిమాతో మీకు పెద్ద పండుగేనంటూ ముందుగానే హింట్ ఇచ్చాడట. అలా తాను కూడా తన అభిమానులను నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో రామ్ ట్విట్టర్లో ఇలాంటి మెసేజ్ చేశాడట. తెలుగు సినీ పరిశ్రమలో రామ్ ట్విట్టర్ మెసేజ్ కాస్త హాట్ టాపిక్‌గా మారుతోంది.