నా ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయాల్సిన కర్మ పట్టలేదు.. హన్సిక
సోషల్ మీడియాలో ఇటీవల హన్సిక ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినీ ఛాన్సులు లేకుండా నానా తంటాలు పడుతున్న హన్సిక తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసిందని టాక్ వచ్చింది. హన్సిక కావాలనే ఈ ఫోటోలను లీక్ చేయించిందని ప్రచారం జరిగింది.
హన్సిక ఫోటోలు లీక్ కావడంతో ఆమె అభిమానులు వెంటనే స్పందించి... హన్సికకు, ఇన్‌స్టాగ్రామ్‌కు ట్యాగ్ చేయడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో హన్సిక వాటిని వెంటనే తొలగించింది. కానీ హన్సిక పబ్లిసిటీ కోసం ఈ ఫోటోలను నెట్టింట వైరల్ చేసిందని టాక్ వచ్చింది.
ఈ ప్రచారంపై హన్సిక సీరియస్ అయ్యింది. తన గురించి ఇప్పటివరకు తాను చెప్పుకున్న సందర్భాలు లేవని.. సోషల్ మీడియాను తాను ఎలా అనుసరిస్తానో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.
కావాలనే తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయాలనే కర్మ పట్టలేదని.. అలా అంటున్నవారికి సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని తెలిపింది.