సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (18:09 IST)

పేట తెలుగు ట్రైలర్.. రజనీకాంత్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ అదుర్స్ (video)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే ''పేట'' సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పేట తెలుగు ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌లో రజనీకాంత్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ అదిరిపోయాయి.


కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖి, విజయ్ సేతుపతి, శశికుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం విడుదలైన పేట తెలుగు ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. 20 మందిని పంపించాను. అందరినీ చితక్కొట్టి పంపించాడు.. అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలవుతోంది.


చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట అనే డైలాగులు బాగున్నాయి. సిమ్రాన్, త్రిషల పరిచయం చేసే సన్నివేశాలు బాగున్నాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.