1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Superstar Rajinikanth Petta official Trailer released

రజినీకాంత్ 'పేట' ట్రెయిలర్ పంబరేపుతోంది... 'వినయ విధేయ రామ'కు పోటీనా?

Petta official Trailer
రజినీకాంత్ పేట తమిళ ట్రెయిలర్ జస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రెయిలర్లో రజినీకాంత్ 60 ఏళ్లు పైబడినా 30 ఏళ్ల యువకుడిలా యాక్టివ్‌గా కనబడ్డాడు. విశేషం ఏమిటంటే... ఈ తమిళ ట్రయిలర్ ఇప్పుడు తెలుగులోనూ ట్రెండింగ్‌గా వుండటం. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. సీనియర్ నటీమణులు సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. 
 
తాజాగా విడుదలైన ట్రెయిలర్‌కు వీక్షకుల నుంచి విశేషమైన ఆదరణ కనబడుతోంది. ఇకపోతే సంక్రాంతి పండుగకు రామ్ చరణ్, కైరా అద్వానీ నటించిన వినయవిధేయ రామ కూడా వస్తోంది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. మరి సంక్రాంతి పందెంలో వినయ విధేయ రామకు రజినీకాంత్ చిత్రం పేట పోటీ ఇస్తుందా... చూడాల్సిందే. చూడండి రజినీకాంత్ పేట ట్రెయిలర్...
తర్వాతి కథనం
స్ట్రాతో తాగుతున్నాను..?