మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (11:48 IST)

రజనీకాంత్ సరసన మహానటి

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు యంగ్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ సరసన దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార నటించింది. తాజాగా రజనీకాంత్ పేట్టా సినిమాలో అందాల తార, చెన్నై చిన్నది త్రిష నటిస్తోంది. తాజాగా రజనీకాంత్ సరసన కీర్తి సురేష్ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం రజనీ పేట్టా సంక్రాంతికి రానుంది. 
 
ఈ సినిమాకు తరవాత మురుగాదాస్ దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో మురుగదాస్ బిజీగా వున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో కీర్తి సురేష్‌ను మురుగదాస్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.