శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (11:38 IST)

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు

సూపర్ స్టార్ రజినీకాంత్ జన్మదినం సందర్భంగా దేశంలో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన పుట్టినరోజు డిసెంబరు 12వ తారీఖు. 67 ఏళ్లు పూర్తి చేసుకుని 68 ఏటలో ప్రవేశించిన రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు డీఎంకె చీఫ్ స్టాలిన్. ఇక ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఇకపోతే ఇటీవలే ఆయన నటించిన 2.O విడుదలై సక్సెస్ సాధించింది. తదుపరి ఆయన నటించిన చిత్రం పేట్టా. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా పేట్టాలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిమ్రాన్, రజనీ లుక్ విడుదలైంది. త్రిష, తలైవా లుక్ వచ్చేసింది. ఈ లుక్‌లో రజనీకాంత్ స్టైల్ లుక్, త్రిష చీరకట్టు బాగుంది. 
 
ఆల్రెడీ చేతిలో పూల కుండితో సిమ్రాన్‌తో ఉన్న రజినీకాంత్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీలో రజినీకాంత్, త్రిషకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌ చూస్తుంటే. త్రిష పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించినట్టు కనబడుతుంది. విలేజ్ అమ్మాయిగా త్రిష లుక్ బాగుంది. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో చాలా యంగ్‌గా కనిపించే లుక్ విభిన్నంగా.. ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధికీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.