మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 12 డిశెంబరు 2018 (10:32 IST)

కేసీఆర్‌కు సినీ తార‌ల అభినంద‌న‌లు...

తెలంగాణలో ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి ఆ పార్టీ నాయకులకు సినీ తారల నుంచి  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని స‌ర్వేలు, రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌ను తారుమారు చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ హృదయపూర్వక విజయాభినందలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
నాలుగున్నరేళ్ల కాలం పాటు పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న శ్రీ కే చంద్ర శేఖర రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు.
 
హీరోలు మ‌హేష్ బాబు, అఖిల్, శ్రీకాంత్‌, సుధీర్‌ బాబు, నాని, నిఖిల్‌, మంచు మనోజ్‌‌లతో పాటు దర్శకులు హరీష్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని, మెహర్‌ రమేష్‌, కోన వెంకట్‌, మధుర శ్రీధర్ త‌దిత‌ర‌ సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు.