సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (12:18 IST)

#HBDSuperStarRajinikanth : నటీనటుల బర్త్ డే ట్వీట్స్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 67వ పుట్టినరోజును మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యలంతా అభినందనలు తెలియజేస్తున్నారు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 67వ పుట్టినరోజును మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యలంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కింగ్ మోహన్‌బాబు కూడా తన స్నేహితుడు రజనీకి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. రజనీ, మోహన్‌బాబు చాలా కాలంగా మంచి మిత్రులు. "హ్యాపీ బర్త్‌డే మై డియర్ ఫ్రెండ్ రజినీ.. నువ్వు నిండు నూరేళ్లు మంచి హెల్త్, వెల్త్‌తో జీవించాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే, పలువురు నటీనటులు ఆయనకు విషెస్ చెపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. 
 
మంచు మనోజ్ : ఎక్కడైనా.. మా లెజెండ్ సింప్లిసిటీని ప్రదర్శిస్తారు. వెరీ హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ రజినీ అంకుల్. ఎప్పటికీ అంతంకాని ఎనర్జీకి మీరు నిజమైన ఇన్స్ఫిరేషన్. కాలా చాలా ఎగ్జైటెడ్.
 
కాజల్ అగర్వాల్ : హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ రజినీ సార్. మీరు చాలా ఆరోగ్యంగా.. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా.. కీప్ ఇన్‌స్పైరింగ్. 
 
రకుల్ ప్రీత్ సింగ్ : గ్రేటెస్ట్ సూపర్ స్టార్ రజినీకి హ్యాపీ బర్తడే! మీకు ఈ ఇయర్ చాలా బాగుంటుంది సార్. మీ ప్రభావం మరిన్ని జనరేషన్స్‌పై ఉంటుంది. 
 
హాన్సిక : వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్‌కి హ్యాపీ బర్త్ డే. మీరు ప్రపంచానికి ఓ గిఫ్ట్. ఎల్లప్పుడూ మీరు బాగుండాలి. 
 
కాగా, రజనీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ '2.0' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్, 2018న ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అలాగే, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రజినీ అల్లుడు ధనుష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. రోబో సీక్వెల్ తర్వాత కాలా ప్రేక్షకుల ముందుకురానుంది.