శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (18:51 IST)

మోదీపై పడిన కత్తి.. నన్ను అరెస్ట్ చేయలేదంటున్న మహేష్

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరహంతకుడని వ్యాఖ్యానించిన కత్తికి ఇబ్బందులు తప్పట్లేదు. మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరహంతకుడని వ్యాఖ్యానించిన కత్తికి ఇబ్బందులు తప్పట్లేదు. మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ.. ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన మహేష్ కత్తి.. ప్రస్తుతం మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ నేతల కోపానికి కారకుడైనాడు.
 
నరేంద్ర మోదీ ప్ర‌ధాని అయినంత మాత్రానా ఏం చేసినా రైట్ అయిపోయిద్దా.. నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉంద‌ని క‌త్తి ట్వీట్ చేయ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ర‌చ్చ‌కి తెర‌లేపింది. దీంతో మోదీని నరహంతకుడు అన్నందుకుగానూ మ‌హేష్ క‌త్తిని పోలీసులు అరెస్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. అంతేగాకుండా పోలీసులకు రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మహేష్ కత్తి అరెస్టయినట్లు వార్తలొచ్చాయి. వీటిని ఫేస్‌బుక్‌లైవ్‌లో కత్తి ఖండించారు. తాను అరెస్ట్ అయిన‌ట్లుగా కొన్ని న్యూస్ ఛానెళ్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాను అరెస్ట్ కాలేదన్నారు. అరెస్టయ్యేంత కేసు కాదని.. కేవలం ట్విట్టర్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు.
 
తననెవ్వరు అరెస్ట్ చేయలేదని.. తాను స్వతంత్రుడిని అని.. ఎంత వ‌ర‌కు మాట్లాడితే మ‌నకి ఏమీ కాదో అంతవరకే మాట్లాడుతానని కత్తి అన్నారు. హక్కుల గురించి తనకు బాగా తెలుసునన్నారు.