శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (14:22 IST)

పవన్ కళ్యాణ్.. ఇక నీ సొల్లు డ్రామాలు ఆపు: జగన్ అభిమాని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా కౌంటర్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్‌పై పవన్ చేసే విమర్శలపై ఓ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా కౌంటర్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్‌పై పవన్ చేసే విమర్శలపై ఓ జగన్ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. పవన్‌కు దమ్ముధైర్యం వుంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీ చేయాలని సవాల్ విసిరాడు. పవన్‌పై జగన్ అభిమాని చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ కామెంట్ల వివరాలకు వెళ్తే.. పవన్ కళ్యాణ్ ఇక సొల్లు డ్రామాలు, వెర్రి వేషాలు ఆపాలని జగన్ ఫ్యాన్ మండిపడ్డాడు. నాలుగు నెలలకోసారి బయటికి వచ్చి అరుపులు కేకలు పెట్టే నీ నటన ముందు చంద్రబాబు కూడా పనికిరాడని ఏకిపారేశాడు. మీ లీడర్ చంద్రబాబు నటించమంటే నువ్వు జీవిస్తున్నావ్ .. అసలు ఇవన్నీ దేనికి..? 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులను నిలబెట్టు.. ఎన్ని ఓట్లు వస్తాయో.. ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం.. అంటూ సవాల్ విసిరాడు. అప్పుడు చూద్దాం నీ తడాఖా ఏంటో.. అప్పుడు  వింటాం నీ కేకలు, అరుపులు అంటూ జగన్ అభిమాని అన్నాడు. 
 
డమ్మీ పార్టీ జనసేన గురుంచి ఎన్ని డబ్బాలు అయినా చెప్పుకో.. మాకేం ఇబ్బంది లేదు.. కానీ వైస్సార్ గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గురుంచి కానీ అవాకులు చవాకులు పేలితే వైస్సార్ అభిమానులు కూడా స్పందిస్తారని చెప్పాడు. పవన్‌కు ఎలా అభిమానులున్నారో అంతకంటే పది రెట్లు అభిమానులు వైస్సార్ గారికి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నారని ఆ అభిమాని గుర్తు చేశాడు. గత ఎన్నికల్లో ఒకకోటి ముప్పై లక్షల మంది వైకాపాకు ఓటేశారని.. అది వైఎస్సార్ బ్రాండ్ అన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో నిరూపించుకోవాల్సిందిగా పవన్‌కు జగన్ అభిమాని సవాల్ విసిరారు.