శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2017 (16:51 IST)

పరిటాల నాకు గుండు కొట్టించారా? చిన్నన్నయ్య కూడా అడిగారు... పవన్ కళ్యాణ్

జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన గురించి, తనపై అప్పట్లో జరిగిన ఓ ప్రచారం గురించి గుంటూరులో మాట్లాడారు. జనసేన కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... అప్పట్లో ఓ ప్రచారం చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. తనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి గు

జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన గురించి, తనపై అప్పట్లో జరిగిన ఓ ప్రచారం గురించి గుంటూరులో మాట్లాడారు. జనసేన కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... అప్పట్లో ఓ ప్రచారం చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. తనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి గుండు కొట్టించారంటూ మొదలైన ప్రచారం పేపర్లకు కూడా ఎక్కిందన్నారు. అలా తన గురించి ప్రచారం చేసినవారు ఎవరో కూడా తనకు తెలుసునన్నారు.
 
ఐతే ఓ రోజు తన చిన్నన్నయ్య నాగబాబు ఫోన్ చేసి... పరిటాల రవి నిన్ను ఎత్తుపోయారా తమ్ముడూ అంటే నాకేం అర్థం కాలేదన్నారు. అసలు పరిటాల రవి ఎవరూ అని ప్రశ్నించినట్లు చెప్పారు. ఐతే ఈ ప్రచారం వెనుక వున్నవారు అప్పట్లో టిడీపిలోనే వున్నారనీ, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. తనపై జరిగిన ప్రచారం చంద్రబాబు నాయుడుకి తెలియకపోవచ్చన్నారు. 
 
ఐనా తనకు గుండు కొట్టించే పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానా అని ప్రశ్నించారు. అప్పట్లో తనకు సినిమాలపై చిరాకు పుట్టి గుండు కొట్టించుకున్నట్లు తెలిపారు. మొన్నీమధ్య గెడ్డం, జుట్టు పెంచుకున్నాననీ కూడా గుర్తు చేశారు. అవన్నీ ఎందుకు చేశానన్నది అప్పటి పరిస్థితిని బట్టి వుంటుందని వెల్లడించారు పవన్.