శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (12:50 IST)

కీర్తి సురేష్.. పవన్ బుగ్గ పట్టుకుని ఎలా బుజ్జగిస్తుందో చూడండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అను

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తోంది. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్యూట్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కీర్తి సురేష్ ఎరుపు రంగు చీరలో అదరిపోగా, ఏమీ తెలియని చిన్నపిల్లాడి ముఖం పెట్టిన పవన్ కల్యాణ్ లుక్ ఈ పోస్టర్లో అదరిపోయింది.
 
ఈ స్టిల్‌లో కీర్తి సురేష్ పవన్ బుగ్గలు పట్టుకుని మరీ బుజ్జగిస్తోంది. ఈ స్టిల్‌కు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.