గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (11:31 IST)

సూపర్ స్టార్‌కు బర్త్ డే గిఫ్ట్.. పేట్టా ట్రైలర్ (Video)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా పేట్టా ట్రైలర్ బుధవారం విడుదలైంది. డిసెంబర్ 12న సూపర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో పేట్టా టీమ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, రజనీకాంత్, సిమ్రాన్, త్రిష నటిస్తున్న పేట్టా సినిమా సంక్రాంతికి తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం సమకూర్చాడు.
 
ఈ సినిమాలో రజనీతో పాటు విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, శశి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే పేట్టా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ 90టీస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి పదో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.