గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (19:01 IST)

ఎస్పీబీని అవమానించారు.. సోషల్ మీడియాలోనూ మీమ్స్ కూడా అదే రకంగా?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను అవమానించారంటూ.. సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో పాటలు పాడిన ఎస్పీబీని.. అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి, సంక్రాంతికి విడుదల కాబోతున్న పేట్ట సినిమాలోని మరణ మాస్ సాంగ్‌లో కొన్ని లైన్లు మాత్రమే ఎస్పీబీ పాడించారు. 
 
పాట మొత్తం కాకుండా కొన్ని లైన్లు మాత్రమే పాడించడం ఎస్పీబీని అవమానపరచడమేనని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకి తనతో కొన్ని లైన్లు పాడించారు. అయినప్పటికీ చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కు పాడినందు సంతోషంగా వుందని ఎస్పీబీ సంస్కారవంతంగా బదులిచ్చినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. 
 
పాటల్లో కొత్త పోకడలు మొదలయ్యాక ఎస్పీబీ లాంటి ప్రముఖ గాయకులను పక్కనబెట్టేశారని.. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో ఎస్పీబీ ఎన్ని పాటలు పాడారో గుర్తు పెట్టుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు. కాగా పేట్టా మరణ మాస్ సాంగ్ రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో ఎస్పీబీ పాడిన లైన్స్‌ను సూచిస్తూ కొన్ని మీమ్స్ పేలాయి.