మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (18:21 IST)

రజనీకాంత్ ''పేట్ట'' మాస్ సాంగ్.. (#MakingOfMaranaMass).. లేటు వయస్సులో..?

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటు వయస్సులో రికార్డుల పంట పండిస్తున్నారు. రోబో సీక్వెల్ 2పాయింట్ ఓతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రజనీకాంత్.. తదుపరి సినిమా రిలీజ్‌లో బిజీబిజీగా వున్నారు. ''పేట్ట'' సినిమా షూటింగ్‌లో రజనీకాంత్ తన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ మాస్ మసాలా సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. 
 
ఈ పాటను కంపోజ్ చేస్తూ తీసిన మేకింగ్ వీడియోను ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించే పేట్ట సినిమా సంక్రాంతి కానుకగా రజనీ అభిమానుల ముందుకు రానుంది. ఇందులోని ''మరణ మాస్'' సింగిల్ ట్రాక్‌ను ఈ సినిమాను నిర్మించే సన్ పిక్చర్స్ ప్రకటించింది. 
 
అనిరుధ్ ఈ పాటను యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. రజనీ ఫ్యాన్సుకు మాత్రమే కాకుండా.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఈ పాట వుంది. ఈ పాట మేకింగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.