గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (12:44 IST)

నయనతార యాడ్స్ కోసం అంత తీసుకుంటుందా?

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రకటనలో నటిస్తూ భారీగా పారితోషికం పుచ్చుకుంటోందట. యాడ్స్ కోసం నయనతార తీసుకుంటున్న పారితోషికం పెద్దమొత్తమేనని తెలియవచ్చింది. డజన్ల సంఖ్యలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా వున్న నయనతార.. గ్యాప్‌లో ప్రకటనలు చేస్తూ వస్తోంది. 
 
ఇలా ఓ యాడ్ కోసం రూ.3కోట్ల జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక సినిమాలో నయనతార నటించేందుకు రూ.5కోట్లు తీసుకుంటుందట. ఆమె మార్కెట్ రేంజ్ బాగా పెరిగిపోవడంతో.. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  
 
ప్రస్తుతం నయనతార నటించి హిట్ అయిన అరం సినిమాకు సీక్వెల్ రానుంది. గోపి నయనార్ నిర్మించే అరం-2 సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్‌లో నయనతార రాజకీయవేత్తగా కనిపించనుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని గోపి క్లారిటీ ఇచ్చాడు.