శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (16:30 IST)

21 రోజుల‌లో రూ.750 కోట్లు : తొలి తమిళ మూవీగా 2.O రికార్డు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, దర్శకుడు ఎస్.శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "2.O". నవంబరు 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఈనెల 28వ తేదీకి నెల రోజులు పూర్తిచేసుకోనుంది. అయితే, ఈ చిత్రం 21 రోజుల్లో రూ.750 కోట్లను వసూలు చేసింది.
 
ఒకక్ హిందీ భాషలోనే 8 రోజులుకుగాను రూ.500 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా '2.O' రికార్డుల‌కెక్కింది. అయితే సైంటిఫిక్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం 21 రోజుల‌కిగాను రూ.750 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టింద‌ని స‌మాచారం. 
 
ఈ చిత్రం త్వరలోనే రూ.800 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే డిసెంబ‌రు 21వ తేదీన పలువురు అగ్రహీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో '2.O' చిత్రం ప్రదర్శించే థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ఫలితంగా రూ.800 కోట్ల మార్క్ చేరుకునేందుకు మ‌రికొంత సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 
 
కాగా, లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప‌క్షి రాజా పాత్ర‌లో క‌నిపించ‌గా, అమీ వెన్నెల అనే రోబోగా అల‌రించింది. ఇక రజనీకాంత్‌ డాక్టర్‌ వశీకరణ్‌, చిట్టి, 2.O, మైక్రోబోట్స్‌ 3.O వంటి పలు పాత్రల్లో అల‌రించారు.