శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 20 డిశెంబరు 2018 (13:25 IST)

జూబ్లిహిల్స్‌లో దారుణం... చలి పెడుతుందని బొగ్గులు కుంపటి పెడితే...

జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చలి పెడుతుందని ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న తల్లి కుమారులు ఇల్లంతా పొగచూరి మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంకు చెందిన సత్యబాబు అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని ప్లాట్ నెంబర్ 306 గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
 
బుధవారం చలి పెడుతుండటంతో బుచ్చి వేణి ఆమె కుమారుడు పద్మరాజు ఇద్దరు ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు మూసుకున్నారు. నిద్రించడంతో ఇంట్లో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు.