మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (08:51 IST)

పెద్ద నోట్ల రద్దుతో ముగ్గురు బ్యాంకు సిబ్బంది.. ఓ కస్టమర్ చనిపోయాడు..

గత 2016 సంవత్సరం నవంబరు 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద కరెన్సీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. దీనివల్ల అనేక మంది ఖాతాదారులు మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న తమ నగదును డ్రా చేసుకునేందుకు రేయింబవుళ్లు ఏటీఎం కేంద్రాల వద్ద పడిగాపులుకాశారు. ఇవేమీ కేంద్రంలోని బీజేపీ పాలకుల కళ్లకు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, రాజ్యసభలో సీపీఎం ఎంపీ ఎళమారన్ కరీం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఓ ప్రశ్న సంధించారు. పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిందనీ, దీనివల్ల అనేక మంది చనిపోయారన్నారు. దీనికి విత్తమంత్రి జైట్లీ సమాధానమిస్తూ, పెద్ద నోట్ల రద్దు కారణంగా కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే చనిపోయారని చెప్పారు. ఇందులో ముగ్గురు బ్యాంకు సిబ్బంది కాదా, ఒక ఖాతాదారుడు ఉన్నట్టు తెలిపారు. 
 
ఈ మేరకు భారతీయ స్టేట్ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొందని విత్తమంత్రి గుర్తుచేశారు. పైగా, చనిపోయిన ఖాతాదారుడు కుటుంబానికి రూ.3 లక్షలు, ముగ్గురు బ్యాంకు సిబ్బందికి రూ.44 లక్షల పరిహారం అందజేసినట్టు మంత్రి సభలో సమాధానమిచ్చారు.